Minor wrestler’s Father: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన 17 ఏళ్ల రెజ్లర్ తండ్రి బుధవారం మాటమార్చారు. బ్రిజ్ భూషణ్ పై తాము కోపంతోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశామని చెప్పారు. తాము కోర్టులో చేసిన ప్రకటనను ఇప్పుడే మార్చామని మరియు కేసును ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.
నా కూతురితో అనుచితంగా ప్రవర్తించలేదు..(Minor wrestler’s Father)
నా కుమార్తె పట్ల రెజ్లింగ్ ఫెడరేషన్ వివక్ష చూపడంతో కోపంతో మేము లైంగిక వేధింపుల ఆరోపణలు చేశాము. నా కూతురితో భూషణ్ అనుచితంగా ప్రవర్తించలేదు. మేము జూన్ 5న మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద నా స్టేట్‌మెంట్‌ను మార్చుకున్నాము. ఈ పోరాటంలో నేను ఒంటరిగా ఉన్నాను, ఆ సమయంలో రెజ్లర్లు తప్ప ఎవరూ నాకు సహాయం చేయలేదు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా కుటుంబం తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తోంది. జూన్ 5న, బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడలేదని మేము సుప్రీంకోర్టులో స్పష్టం చేసాము. కానీ అతనిపై వివక్ష ఆరోపణలు ఉన్నాయని మైనర్ రెజ్లర్ తండ్రి చెప్పారు.
మేము ఎటువంటి దురాశ, ఒత్తిడి లేదా భయం లేకుండా మా ప్రకటనను మార్చాము. నా కూతురు మైనర్ అన్నది పూర్తిగా కరెక్ట్. మేము కేసును ఉపసంహరించుకోలేదు. ప్రకటన మార్చామని అతను పేర్కొన్నారు.