Site icon Prime9

INS Mormugo: ఐఎన్ఎస్ మోర్ముగో నుండి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

INS Mormugo

INS Mormugo

INS Mormugo: ఆత్మనిర్భర్ భారత్  చొరవకు ప్రోత్సాహకంగా, ఐఎన్ఎస్ మోర్ముగో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించింది.మోర్ముగో మరియు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి, రెండూ దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి.

గోవాలో ఓడరేవు పేరు.. ( INS Mormugo)

ప్రాజెక్ట్ 15B స్టెల్త్-గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లలో ఐఎన్ఎస్ ముర్మోగోవా రెండవది. దీనిని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDSL) నిర్మించింది. డిసెంబరు 18, 2022న భారత నావికాదళంలోకి INS మోర్ముగావోను నియమించారు. దీనికి గోవాలోని కీలకమైన ఓడరేవు పేరు పెట్టారు.బ్రహ్మోస్ రెండు-దశల క్షిపణి, దాని మొదటి దశగా సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్ ఇంజన్ ఉంది. ఇది దానిని సూపర్‌సోనిక్ వేగానికి తీసుకువస్తుంది. ఇది ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క NPO Mashinostroyeniya  జాయింట్ వెంచర్. ఈ  రెండు కంపెనీలు కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను ఏర్పాటు చేశాయి.

ఈ ఏడాది మార్చిలో, రక్షణ మంత్రిత్వ శాఖ విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)లో సాధారణ రీఫిట్ సబ్‌మెరైన్ సింధుకీర్తి కోసం ఒప్పందంపై సంతకం చేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.934 కోట్లు. సింధుకీర్తి మూడవ కిలో క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్. రీఫిట్ పూర్తయిన తర్వాత, సింధుకీర్తి సమర్థంగా పోరాడుతుంది.భారత నావికాదళంలోని క్రియాశీల జలాంతర్గామి నౌకాదళంలో చేరుతుంది అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version