Bomb Threats to Air India Flight: అలర్ట్. మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని టేకాఫ్ అయిన వెంటనే అక్కడే దింపారు.
వివరాల ప్రకారం.. బోయింగ్ 777 ఎయిరిండియా విమానం ముంబై నుంచి న్యూయార్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి సుమారు 4 గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అజర్ బైజాన్ ప్రాంతంలో విమానం గాల్లో ఉండగానే సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో వెంటనే పైలట్లు అప్రమత్తమై అక్కడి నుంచి విమానాన్ని ముంబైకు టర్న్ చేశారు.
ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. విమానంలో ఉన్న ప్రయాణికులతో సిబ్బందిని దింపింది. ఆ తర్వాత విమానంలో తనిఖీలు చేపట్టింది. అయితే బాంబుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా, బెదిరింపు వచ్చిన కాల్ నకిలీ అయి ఉండవచ్చని తెలుస్తోంది.