Prime9

Bomb Threat to Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. నాగపూర్ లో ల్యాండింగ్!

Bomb Threat to Mascut – Kochi – Delhi Indigo Flight: కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కాగా బాంబు బెదిరింపులు వచ్చిన కాసేపటికే విమానం కొచ్చి నుంచి బయల్దేరింది. దీంతో అధికారులు విమానాన్ని నాగపూర్ కు దారి మళ్లించారు. విమానం నాగపూర్ లో ల్యాండ్ చేశారు.

 

ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఈ 2706 విమానం మస్కట్ నుంచి కొచ్చి మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే విమానం కొచ్చి నుంచి బయల్దేరే సమయంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. కానీ అప్పటికే విమానం కొచ్చి నుంచి టేకాఫ్ కావడంతో దాన్ని నాగపూర్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో ప్రయాణికులను దింపి.. తనిఖీలు చేశారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని పరిశీలించాయి. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు నాగపూర్ డీసీపీ లోహిత్ మతాని వివరాలు తెలిపారు. అయితే ముంబైలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చి ఒకరోజు కూడా కాకుండానే మరోసారి బాంబు బెదిరింపులు రావడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

Exit mobile version
Skip to toolbar