Site icon Prime9

Pahalgam Terror Attack: బలగాలకు తీవ్రవాదుల ట్రాప్..? ఇంట్లో బాంబులు పెట్టి మరీ..!

pahalgam terrorists trap

pahalgam terrorists trap

Blast at Pahalgam Terrorist Home is Trap for Soldiers: జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలు పేట్రేగిపోతున్నాయి. పహల్గాం దాడితో  ఆరాచకత్వం తారాస్థాయికి చేరింది. ఉగ్రవాదుల ఏరివేతను చేపట్టిన భారత భద్రతా బలగాలు దుండగుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ముందే అంచనా వేసిన ఉగ్రవాదులు వాళ్ల ఇంట్లో పేలుడు పదార్థాలను పెట్టారు. బలగాలు సెర్చ్ చేస్తుండగా రిమోట్ కంట్రోల్ తో యాక్టివేట్ చేస్తున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆఫీస్ ఫౌజీ ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టి బద్రతా బలగాలు రాగానే ఇంటిని పేల్చేశారు. ఆ ప్రమాదం నుంచి బలగాలు త్రుటిలో తప్పించుకున్నాయి.

 

అసిఫ్ ఫౌజి అలియాస్ అసిఫ్ షేక్ అనే తీవ్రవాది ఇంట్లో  పేలుడు పదార్థాలు పెట్టారు. సెర్చింగ్ చేస్తున్న సిబ్బందికి అవి ఆక్టివేట్ అయినట్లుగా గుర్తించారు. వెంటనే బయటకు రాగా భారీ పేలుళ్లు సంభవించాయి. కాశ్మీర్ కు చెందిన ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి చర్యలకు తీవ్రవాదులు పాల్పడుతున్నారన్నారు.

 

కాశ్మీర్ కు చెందిన ఆదిల్ 2018లో అధికారికంగానే పాకిస్థాన్ కు వెళ్లి గతేడాది జమ్మూకాశ్మీర్ కు తిరిగి వచ్చాడు. వచ్చీరాగానే ఉగ్రవాద చర్యలకు పూనుకున్నాడు. అక్కడ ఉగ్ర శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజు ముగ్గురు తీవ్రవాదుల ఫొటోలను భారత భద్రతా బలగాలు రిలీజ్ చేశాయి. అసిప్ పౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరికి ఆదిల్ థోకర్ అనే మరో ఉగ్రవాదితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

 

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా వీరు పనిచేస్తున్నారు. వీరి ఆర్గనైజేషన్ పేరు ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’. ఇది జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తుంది. పహల్గాంలో జరిగిన దాడిలో 26మంది టూరిస్టులు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల ఏరివేతను భారత బలగాలు ముమ్మరం చేశాయి.

 

Exit mobile version
Skip to toolbar