BJP Parvesh Verma Reacts On CM Post in Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన అరవింద్ కేజ్రీవాల్.. నాలుగోసారి ఓటమిని చవిచూశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పర్వేశ్ వర్మ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది.
ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ శర్మ కావడం విశేషం. ఆయన 1977 నవంబర్ 7న జన్మించాడు. ఎంబీఏ పూర్తి చేసిన పర్వేశ్ శర్మ.. కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాగా, 2014 నుంచి 2024 వరకు ఈస్ట్ ఢిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కూడా కొనసాగారు. తాజాగా, వెల్లడైన ఎన్నిక ఫలితాల్లో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించడంతో దేశ వ్యాప్తంగా ఎవరీ పర్వేశ్ శర్మ అంటూ వెతకడం మొదలు పెట్టారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.