Prime9

IndiGo Flight: ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో 160 మంది ప్రయాణీకుల దించివేత.. ఎక్కడో తెలుసా?

IndiGo Flight:  దుబాయ్‌కి వెళ్లే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టడంతో 160 మందికి పైగా ప్రయాణికులను దించాల్సి వచ్చింది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏ)లో గురువారం ఉదయం 8.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానం రీ షెడ్యూల్ .. (IndiGo Flight)

ఈ సంఘటన జరిగినప్పుడు ఇండిగో ఫ్లైట్ 6E 1467 IXE-DXB విమానం అప్పుడే రన్‌వేలోకి ప్రవేశించింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించిన తర్వాత, విమానం తిరిగి ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ కు చేరుకుంది. అనంతరం బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇండిగో విమానంలో ప్రయాణికులకు వసతి కల్పించారు. విమానం దుబాయ్‌కి రీషెడ్యూల్ చేయబడింది. ఉదయం 11.05 గంటలకు ఈ విమానం బయలుదేరిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్‌లో, ఫ్లై దుబాయ్ విమానాన్ని ఒక పక్షి ఢీ కొట్టడంతో విమానం యొక్క ఇంజన్లలో మంటలు చెలరేగాయి. నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar