Biparjoy: 24 గంటల్లో అతి తీవ్రం కానున్న ‘బిపోర్ జాయ్’.. ఆ రాష్ట్రాలకు అలర్ట్

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతారణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చి భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర- ఈశాన్య దిశగా కదులుతోందని ప్రకటించింది.

Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతారణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చి భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర- ఈశాన్య దిశగా కదులుతోందని ప్రకటించింది. గోవాకు పశ్చిమాన 690 కిలో మీటర్ల లో దూరంలో , ముంబై కి పశ్చిమ-నైరుతి దిశలో 640 కిమీలో కేంద్రీకృతమై ఉంది.

 

భారీ నుంచి అతి భారీ వర్షాలు(Biparjoy)

బిపోర్ జాయ్ తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అదే విధంగా కర్ణాటక- మహారాష్ర్ట సరిహద్దులోని తెలంగాణ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. మత్యృకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళొద్దని తెలిపింది.

 

 

తితాల్‌ బీచ్‌ మూసివేత(Biparjoy)

తుఫాన్ ఉధృతి కారణంగా భారీ అలలు ఏర్పడుతున్నాయి. గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా జూన్‌ 10 నుంచి 12 వరకు .. 45 నుంచి 55 కిలోనాట్స్‌ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఈ గాలులు 65 కిలోనాట్స్‌ వరకు చేరుతాయని తెలిపారు.