Site icon Prime9

Bhutan PM Praises PM Modi’s Leadership: ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన భూటాన్ పీఎం

Bhutan PM Calls PM Modi’s ‘Elder Brother’ and ‘World’s Greatest Leader: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భూటాన్ పీఎం షెరింగ్ టోబ్‌గే పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న సోల్ లీడర్ షిప్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో భూటాన్ పీఎం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అన్నయ్య లాంటి వారన్నారు. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అని వర్ణించారు. మోదీది కళాత్మక ఆలోచన అని, నాయకులను పెంపొందించడంతో పాటు సేవ చేయడంలో ఆయన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తనకు గురువని, మరింత కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తిని ఆయన నుంచి పొందుతున్నట్లు తెలిపారు.

‘మొదటి నుంచి నాకు నాయకత్వం గురించి ఏమీ తెలియదు. అందుకు నేను అర్హుడిని కాదు అనుకునేవాడిని, అయితే భారత్‌కు ఓ విద్యార్థిగా వచ్చాను. ఇదో గొప్ప సదావకాశం. ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరొందిన నరేంద్ర మోదీ నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది.’ అని వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar