Site icon Prime9

Bengaluru: బెంగళూరులో అకాల వర్షాలు.. వరదల్లో కొట్టుకుపోయిన బంగారం

Bengaluru

Bengaluru

Bengaluru: గత రెండు రోజులుగా ఐటీ రాజధాని బెంగళూరులో అకాల వర్షాలు ముంచెత్తాయి. కర్ణాటకలో రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఈ వర్షాల వల్ల బెంగళూరు నగరంలోని ఓ గోల్డ్ షాప్ తీవ్రంగా నష్టపోయింది. అకస్మాత్తుగా వరద నీరు షాప్ లోకి రావడంతో బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయని ఓనర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగళూరు పురపాలక శాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 

సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు(Bengaluru)

బెంగళూరులోని మల్లేశ్వర్‌ ప్రాంతానికి చెందిన ఓ నగల దుకాణం ఈ మధ్య వచ్చిన వర్షాలకు.. వరదనీటిలో చిక్కుకుంది. అందుకు కారణం..షాప్ కు దగ్గర్లో జరుగుతున్న నిర్మాణ పనులే ఈ వరదకు కారణమని ఆ షాప్ యజమాని ఆరోపించారు. చెత్తా చెదారం కలిసిన వరద నీరు ఒక్కసారిగా షాపులో పోటెత్తాయని.. దీంతో షాపు సిబ్బంది షట్టర్స్ మూయలేకపోయారని ఆయన చెప్పాడు. వరద చుట్టుముట్టిన వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్‌ చేసి సహాయం కోరామని.. కానీ సహాయం చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పాడు. వరదనీటిలో 80 శాతం బంగారం కొట్టుకుపోయిందని.. దాని విలువ రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

అకాల వర్షాలకు 5 గురు మృతి(Bengaluru)

కాగా, బెంగళూరులో అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల నిండా విపరీతంగా చెత్త పేరుకు పోయింది. చెత్తను తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయని.. వరద నీరు నిలిచి పోయిందనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఆదివారం వచ్చిన వర్షానికి నగరంలోని కేఆర్‌ కూడలి సమీప అండర్‌ పాస్‌లో నీటిలో మునిగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 గురు మృతి చెందారని అధికారులు తెలిపారు.

 

Exit mobile version