Site icon Prime9

Junmoni Rabha : రోడ్డు ప్రమాదంలో అసోం పోలీసు ఆఫీసర్ ‘లేడీ సింగం’.. “జున్‌మోనీ రాభా” మృతి

assam police officer junmoni rambha dies in road accident

assam police officer junmoni rambha dies in road accident

Junmoni Rabha : అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘లేడీ సింగం’గా పేరు పొందిన పోలీసు ఆఫీసర్ జున్‌మోనీ రాభా మృతి చెందారు. రాభా తన ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే జున్‌మోనీ ప్రమాద సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్నారని.. ఆమె ఎక్కడికి వెళ్తున్నారనే విషయంపై స్పష్టత లేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ప్రస్తుతం నాగాన్ జిల్లాలోని మోరికొలాంగ్ పోలీస్ ఔట్‌పోస్టు ఇన్‌చార్జిగా ఎస్సై రాభా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చాలా కఠినంగా, నిజాయితీగా ఉండేవారని.. అందుకే ఆమెకు ‘లేడీ సింగం’గా, ‘దబాంగ్ పోలీస్’గా పేరు వచ్చిందని చెప్పుకుంటారు. అలానే అవినీతి ఆరోపణలపై గతేడాది జూన్‌లో అరెస్ట్ అయిన రాభా కొంత కాలం పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పట్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేతో ఆమె జరిపిన టెలిఫోన్ సంభాషణ ఆడియో కూడా ఫుల్ గా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల పలువురు అధికారులు విషాదం వ్యక్తం చేశారు.

Exit mobile version