Arvind kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని కొన్ని మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటిలో పెట్ – సీటి స్కాన్ ఒకటి కాగా, తన బరువు ఏడు కిలోల వరకు తగ్గిందని, కీటోన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని వివరించారు.
కాగా కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనకు లోకసభ ఎన్నికల్లో ప్రచారానికి చేయడానికి అనుమతించాలని ఆయన ఉన్నతన్యాయస్థానంలో పిటిషన్ వేశారు. బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రచారం ముగిసిన వెంటనే అంటే జూన్ 2న స్వచ్చందంగానే లొంగిపోవాలని షరతు విధించింది. ఇదిలా ఉండగా మాక్స్ హాస్పిటల్స్ మెడికల్ టీం కేజ్రీవాల్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసుకోవాలని సూచించింది. దీంతో పాటు ముఖ్యమంత్రి లీగల్ టీం కూడా కేజ్రీవాల్‌కు వెంటనే ఈ చికిత్సలు మొదలుపెట్టాలని.. మెడికల్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని ఆయన బెయిల్ పొడిగించాలని కోర్టును కోరింది.
బెయిల్ పై వివాదం..(Arvind kejriwal)
కాగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై పెద్ద వివాదమే రేగింది. బీజేపీ నాయకులు కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఎలా ఇస్తారని సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అయితే కోర్టు మాత్రం కేజ్రీవాల్‌కు ఎలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వలేదన స్పష్టం చేసింది. కాగా కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, సుమారు రూ.100 కోట్లు లంచం తీసుకొని హోల్‌సేల్లర్స్ అనుకూలంగా విధానాలు మార్చారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసుకు సంబంధించి మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కూడా బెయిల్‌పై ఉన్నారు.