Site icon Prime9

WhatsApp Web: వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఈజీగా ఎడిట్ చేయొచ్చు!

whatsupweb

whatsupweb

WhatsApp Web: యూజర్లకు వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ వెబ్ బిటా యూజర్లు కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫీచర్ ను ప్రకటించింది. తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎడిట్ ఆప్షన్.. (WhatsApp Web)

యూజర్లకు వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ వెబ్ బిటా యూజర్లు కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫీచర్ ను ప్రకటించింది. తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫిచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందించనుంది. ప్రత్యేకించి వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. దీంతో వాట్సాప్‌ లో మెసేజ్‌ లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఫీచర్ 2023 ప్రారంభంలో ప్రకటించింది. ఈ యాప్ బీటా వెర్షన్‌లో ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. వెబ్ యూజర్లు తమ మెసేజ్‌లను పంపిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ మెసేజ్ మెను ఆప్షన్ల నుంచి ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉన్నంత వరకు ఎడిట్ మెసేజ్‌లను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకోగానే.. మెసేజ్ కొత్త విండోలో ఎడిట్ ఆప్షన్‌తో ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది.

తప్పులను సరిదిద్దడానికే..

ఈ ఫీచర్ తో మనం పంపిన పూర్తి సమాచారాన్ని ఎడిట్ చేయలేం. చాట్‌, గ్రూపులలో మెసెజ్ లను ఎడిట్ చేసేందుకు 15 నిమిషాల సమయం ఉంటుంది.

వాట్సాప్ యూజర్లు చాలా కాలం తర్వాత మెసేజ్ లను పూర్తిగా మార్చలేరని గమనించాలి. ఈ ఫీచర్ కేవలం.. టైపింగ్ లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

ఇలా చేయండి..

ఎడిట్ చేయాలనుకునే చాట్ మెుదట ఓపెన్ చేయండి.

ఎడిట్ చేయాలనుకునే మెసేజ్ ట్యాప్ చేసి పట్టుకోండి.
మెనూ నుంచి ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
కావాల్సిన మార్పులు చేసి డన్ ఆప్షన్ ఎంచుకోండి.

చేసిన మార్పులు సేవ్ అవుతాయి.

మెసేజ్‌ చేసిన 15 నిమిషాల్లో మాత్రమే ఎడిట్ చేయగలరు.

ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్‌లోనే ఉంది. ప్రస్తుతానికి బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

 

Exit mobile version