Site icon Prime9

Anchor Gitanjali Aiyer : ప్రముఖ దూరదర్శన్ యాంకర్‌ గీతాంజలి అయ్యర్ మృతి.. ప్రముఖుల సంతాపం

Anchor Gitanjali Aiyer passed away due to health issues

Anchor Gitanjali Aiyer passed away due to health issues

Anchor Gitanjali Aiyer : ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 70 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందారు. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్‌లో తొలితరం మహిళా ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్లలో ఒకరుగా ఆమె ప్రసిద్ధి.  ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కూడా వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

విద్యాభ్యాసం, కెరీర్..   

కోల్‌కతాలోని లొరెటో కాలేజీలో గీతాంజలి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత 1971లో దూరదర్శన్‌లో చేరారు. దూరదర్శన్ ‌, ఆల్‌ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లిష్ న్యూస్‌ యాంకర్‌గా పనిచేశారు. అదే విధంగా నాలుగు సార్లు ఉత్తమ యాంకర్‌గా అవార్డు పొందారు. మీడియా రంగంలో ఆమె అందించిన అత్యుత్తమ సేవలకు గానూ 1989లో ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డ్ ఫర్ ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి డిప్లొమా హోల్డర్ అయిన అయ్యర్ అనేక వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. వరల్డ్ వైల్డ్‌ లైఫ్ ఫండ్ లోనూ పనిచేశారు. 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన ఆమె.. దూరదర్శన్‌లో కెరీర్‌ ముగిశాక, కార్పొరేట్‌ రంగం వైపు అడుగులు వేశారు. అనంతరం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో కూడా పని చేశారు.

 

Exit mobile version