Kerala: 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దివ్య మొసలిగా కొలువబడుతున్న బబియా మృతి చెందింది. దీంతో భక్తులు మొసలికి నివాళులర్పిస్తూ దైవ ప్రార్ధనలు చేశారు.
సమాచారం మేరకు, ఆలయంలో 75 ఏళ్ల నాటి నుండి బబియా అనే మొసలి జీవిస్తుంది. పూర్తిగా శాఖహారిగా గుర్తింపబడి, స్వామి వారికి రక్షణగా మొసలి బబియా నిలిచింది. భక్తులకు అన్న ప్రసాదం తర్వాత ప్రతిరోజు బబియా మొసలికి కూడా ప్రసాదాన్ని పూజారి అందచేస్తారు. బాబియా విధేయతతో చెరువు నుండి బయటకు వచ్చి ప్రసాదాన్ని తింటుంది.
మాంసహారాన్ని ముట్టకుండా భక్తులను ఆలయానికి మరింత దగ్గర చేసింది. శేష పాన్పు పై సేదతీరిన శ్రీ మహా విష్ణువు దర్శనంతో పాటు మొసలిని కూడా భక్తులు దుర్శించుకొంటారు. మృతి చెందిన మొసలి ఇప్పటివరకు ఎవ్వరిని హాని కూడా తలపెట్టలేదనేది సమాచారం. అనంతపద్మనాభ స్వామి దూతగా, స్వామి వారికి బాబియా కాపలాగా ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. 1945లో ఒక బ్రిటీష్ అధికారి గుడిలోని మొసలి పై కాల్పులు జరిపాడని, కొద్ది రోజుల్లోనే బబియా గుడి చెరువులో కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: నాలుగు పిల్లర్లపై దేవాలయ నిర్మాణం.. చూడాలంటే విమానం ఎక్కాల్సిందే…