Site icon Prime9

Visa Interview : 40 సెకన్లలో అమెరికా వీసా తిరస్కరించారు : ఓ భారతీయుడి ఆవేదన

Visa Interview

Visa Interview

Visa Interview : అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు ఓ భారతీయ యువడు వెళ్లాలని నిర్ణయించకున్నాడు. ఇంతలోనే అతడి ఆశలు క్షణాల్లోనే ఆవిరి అయ్యాయి. ఇంటర్వ్యూలో ఆ యువకుడు చెప్పిన సమాధానం వల్ల 40 సెకన్లలో వీసాను తిరస్కరించారు. ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. నిజాయితీగా సమాధానం చెప్పినా తనకు వీసా ఇవ్వలేదని వాపోయాడు.

 

అసలేం జరిగిందంటే..?
రెడిట్‌లో Nobody 01810 అనే పేరుతో ఉన్న ఓ యూజర్‌ ఇటీవల ఒక పోస్టు చేశారు. బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూ కోసం ఇటీవల యూఎస్‌ ఎంబసీకి వెళ్లినట్లు చెప్పారు. మూడు ప్రశ్నలు అడిగారు. అనంతరం నిమిషంలోగా తనను రిజెక్ట్‌ చేశారని తెలిపారు. అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? భారత్‌ వెలుపల ఎప్పుడైనా పర్యటించారా? యూఎస్‌లో మీకు బంధువులు లేదా స్నేహితులు ఉన్నారా? అని ప్రశ్నలు అడినట్లు చెప్పారు. వీటిని తాను నిజాయితీగా సమాధానం చెప్పినట్లు వివరించారు. రెండు వారాల వెకేషన్‌ ట్రిప్‌ కోసం ఫ్లోరిడా వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఇండియా దాటి ఎక్కడికి వెళ్లేదని చెప్పారు. ఫ్లోరిడాలో తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని సమాధానం చెప్పారు. కానీ, యూఎస్‌ ఎంబసీ అధికారికి తన సమాధానాలు నచ్చలేదేమోనని, వీసాకు తాను అర్హుడిని కాను అంటూ తిరస్కరణ స్లిప్‌ను తన చేతిలో పెట్టారని యూజర్‌ రాసుకొచ్చారు.

 

గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడం కేవలం ఆప్షన్‌ మాత్రమే..
తాను కేవలం పర్యటన కోసమే యూఎస్ వెళ్లాలనుకుంటున్నానని, గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడం కేవలం ఆప్షన్‌ మాత్రమేనని అన్నారు. కేవలం రెండు వారాలు పర్యటించి, తిరిగి భారత్‌ రావాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, వీసా ఎందుకు తిరస్కరించారో అర్థం కావటం లేదని అన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ప్రస్తావించడమే మీరు చేసిన తప్పు అన్నారు. ఆమె సాయంతో అమెరికాలో అక్రమంగా ఉండిపోతారేమోనని వారు భయపడుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

 

Exit mobile version
Skip to toolbar