Site icon Prime9

Air India: ఎయిర్‌ ఇండియా మూత్రవిసర్జన కేసు.. శంకర్ మిశ్రాపై నాలుగునెలలు నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

Air India

Air India

Air India: ఎయిర్‌ ఇండియా మూత్రవిసర్జన కేసులో  నిందితుడు   శంకర్‌ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్‌ ఇండియా నిషేధం విధించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నవంబర్‌ 26న న్యూయార్క్‌ – ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానంలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

శంకర్‌ మిశ్రా అనే వ్యక్తి 72 సంవత్సరాల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి దిల్లీకి తరలించారు.

న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్‌లో మద్యం సేవించి మూత్ర విసర్జన చేశాడని,

ఆ తర్వాత సదరు వ్యక్తిపై ఎయిర్స్‌లైన్స్‌ చర్యలు చేపట్టలేదని బాధితురాలు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కు రాసిన లేఖలో ఆరోపించింది.

ఆ తర్వాత ఎయిర్‌ ఇండియా నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఇదిలా ఉండగా.. వృద్ధురాలిపై మద్యం సేవించి మూత్రం పోసినట్లు వచ్చిన వార్తలను శంకర్‌ మిశ్రా ఖండించారు.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సదరు వృద్ధురాలే మూత్రం పోసుకుందని, ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని కోర్టుకు తెలిపారు.

ఆమె కూర్చున్న సీటు వద్దకు వెళ్లలేరని… అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని,

నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అని ప్రశ్నించారు.

ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు నిరాకరించింది. అదే సమయంలో శంకర్‌ మిశ్రాకు సైతం బెయిల్‌ నిరాకరించింది.

బాధిత మహిళతో అతను చేసిన వాట్సాప్ చాట్ ఈ సంఘటనను సూచించింది.

 

వాట్సాప్ చాట్ తో తెలిసింది..

నిందితుడు మరియు 70 ఏళ్ల వృద్ధురాలికి మధ్య వాట్సాప్ సందేశాలు ఉన్నాయి.

మిశ్రా ఆమె బట్టలు మరియు బ్యాగ్ శుభ్రం చేయడానికి పేటీఎం ద్వారా చెల్లించినట్లు తెలుస్తోంది.

వీరి సంభాషణలో నిందితులు బట్టలు మరియు బ్యాగ్‌ను నవంబర్ 28న క్లీనింగ్ కోసం పంపారని, వాటిని నవంబర్ 30న ఆమెకు డెలివరీ చేశారన్నారు.

నవంబరు 28న పేటీఎంలో మహిళకు, అతడికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నిందితుడు పరిహారం చెల్లించారు.

అయితే, నెల తర్వాత ఆ డబ్బును డిసెంబర్ 19న ఆమె కూతురు తిరిగి ఇచ్చిందని లాయర్లు వెల్లడించారు.

ఉద్యోగంనుంచి తొలగింపు..

మరోవైపు అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో పనిచేస్తున్న మిశ్రాను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ ఇలా చెప్పింది. వెల్ ఫార్గో ఉద్యోగులను వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ప్రవర్తన యొక్క అత్యున్నత ప్రమాణాలకు కలిగి ఉంది.

ఈ ఆరోపణలను మేము తీవ్రంగా కలవరపెడుతున్నాము. ఈ వ్యక్తి వెల్ ఫార్గో నుండి తొలగించబడ్డాడు. మేము చట్ట అమలుకు సహకరిస్తున్నామని తెలిపింది.

ఢిల్లీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి కనీసం ఆరు నుంచి ఎనిమిది మంది సిబ్బందికి సమన్లు పంపారు.

పిలిపించిన వారిలో ఎయిర్ ఇండియా (Air India)పైలట్‌లు కూడా ఉన్నారు.

ఘటన తర్వాత తనకు సీటు ఇవ్వడంపై పైలట్ వీటో చేశారని  బాధితురాలు ఆరోపించారు.

ఇటీవల విమానాల్లో మద్యం తాగిన పురుషులు మహిళలపై మూత్ర విసర్జన చేయడం అత్యంత అసహ్యంగా, అవమానకరమని పేర్కొంటూ

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులు, డీజీసీఏ, ఎయిర్ ఇండియాలకు నోటీసులు జారీ చేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version