Site icon Prime9

Delhi: ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయిన ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్

Delhi

Delhi

Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది.మేయర్ ఎన్నికలకు పోలైన మొత్తం 266 ఓట్లలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లు సాధించి ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తా 116 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. పార్టీపై తమకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టినందుకు ఢిల్లీ ఓటర్లకు ఆప్ కృతజ్ఞతలు తెలిపింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 2 గంటలకు పైగా కొనసాగింది. మేయర్ ఎన్నికలో మొత్తం 10 మంది నామినేటెడ్ ఎంపీలు, 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలు, 241 మంది ఎన్నికైన కౌన్సిలర్లు ఓటు వేశారు.

బీజేపీ ఓటమిని అంగీకరించాలి..(Delhi)

మేయర్ ఎన్నికకు 274 చెల్లుబాటు అయ్యే ఓట్లు అవసరం. కాంగ్రెస్‌కు 9 మంది కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఈ స్థితిలో బధవారం.జరిగిన ఎన్నికల్లో మొత్తం 265 ఓట్లు పోలవ్వాల్సి వచ్చింది. ఇద్దరు మేయర్ అభ్యర్థుల్లో ఎవరికైనా గెలవాలంటే 134 ఓట్లు కావాలి.ఎన్నికల్లో గెలిచిన తర్వాత, షెల్లీ ఒబెరాయ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు.రాజ్యాంగం ప్రకారం పని చేస్తామని హామీ ఇచ్చారు. నేను ఈ సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ సభ గౌరవాన్ని కాపాడుతారని మరియు సజావుగా జరిగేందుకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. బీజేపీ తన ఓటమిని అంగీకరించాలి.

గూండాయిజం ఓడిపోయింది..

ఎన్నికల్లో గెలుపొందిన షెల్లీ ఒబెరాయ్‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. “గూండాలు ఓడిపోయారు, ప్రజానీకం గెలిచింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్‌గా ఎన్నికైనందుకు కార్యకర్తలందరికీ అనేక అభినందనలు .ఢిల్లీ ప్రజలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆప్ మొదటి మేయర్ షెల్లీ ఒబెరాయ్ కి చాలా అభినందనలు అంటూ ట్వీట్ చేసారు.

ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. “గూండాయిజం ఓడిపోయింది, ప్రజారాజ్యం గెలిచింది. మోసం చేసి బీజేపీ సొంత మేయర్‌ని చేసుకోవాలనుకుంది. ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్‌ను అభినందిస్తున్నాను. తర్వాత అలె ఇక్బాల్ డిప్యూటీ మేయర్ అవుతారు” అని అన్నారు.మేయర్‌ను ఎన్నుకునేందుకు గతంలోమూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి– జనవరి 6న, రెండవది జనవరి 24న మరియు చివరిగా ఫిబ్రవరి 6న జరిగిన ఆప్ మరియు బీజేపీ నేతల మధ్య ఘర్షణ కారణంగా ఎన్నిక నిలిచిపోయింది.

134 వార్డులు గెలుచుకున్న ఆప్..

డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులను గెలుచుకుని బీజేపీ 15 ఏళ్ల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టింది. 250 మంది సభ్యులున్న మున్సిపల్‌ హౌస్‌లో కాంగ్రెస్‌ తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ సందర్భంగా, ఢిల్లీ మేయర్ ఎన్నికను మొదటి ఎంసిడి సమావేశంలో నిర్వహించాలని, ఎన్నికైన తర్వాత మేయర్ డిప్యూటీకి అధ్యక్షత వహించాలని ఆదేశించింది.

Exit mobile version