Aadhar-voter Id link: ఓటర్ ఐడీ తో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునేందుకు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఓటర్ తో ఆధార్ లింక్ చేసే సమయాన్ని ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.
మరోసారి గడువు పెంచుతూ..(Aadhar-voter Id link)
న్యాయ మంత్రిత్వ శాఖ గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఓటర్ ఐడీని ఆధార్ తో లింక్ చేసేందుకు ఏప్రిల్ 1, 2023 వరకు గడువు ఇచ్చింది. ఈ నోటిషికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ -6బీ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్ అయిన ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించడం ప్రారంభించింది.
గత ఏడాది డిసెంబర్ 12 వరకు 54.32 కోట్ల ఆధార్ సంఖ్యలను సేకరించినట్టు సమాచారం. కానీ, వాటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మెదలు కాలేదు. ఈ నేపధ్యంలో ముందు ఇచ్చిన గడువు సమీపిస్తుండటంతో కేంద్రం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
బోగస్ కార్డులను గుర్తించేందుకు..
ఆధార్ తో ఓటర్ కార్డును లింక్ చేసుకోవడం ద్వారా బోగస్ ఓట్లను గుర్తించేందుకు వీలు పడుతుంది. ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే అవి రద్దు అవుతాయి. ఈ విధానం వల్ల పారదర్శకత వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పాన్ కార్డు గడువుకు విజ్ఢప్తి
మరోవైపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసే ప్రక్రియకు తుది గడువును పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీంతో పాటు రూ. 1000 ఫైన్ ను కూడా తీసివేయాలని విజ్ఢప్తి చేశారు. ఆధార్- పాన్ అనుసంధానికి మార్చి 31 తో గడువు ముగియనుంది.
ఒక వేళ ఇలా లింక్ చేసుకోలేపోతే పాన్ కార్డు పనిచేయదు. అయితే, ఇలా మార్చి 31,2022 నాటికి ఉచితంగానే లింక్ చేసుకునే వీలు కల్పించింది. ఆ తర్వాత రూ. 500 ల ఫైన్ తో ఏప్రిల్ 1, 2022 వరకు పొగిడించగా.. జూలై 1 , 2022 నుంచి అపరుధారుసం ను 1000 కి పెంచింది. తాజాగా ఆ గడువు కూడా దగ్గరపడుతోంది.