Site icon Prime9

Exams In Ambulance: పురిటి నొప్పులను సైతం లెక్కచెయ్యకుండా.. అంబులెన్సులోనే పరీక్ష రాసిన సూపర్ మామ్

Exams In Ambulance prime9 news

Exams In Ambulance prime9 news

Jhunjhunu: మరో ఆరుగంటల్లో బిడ్డకు జన్మనిస్తానని తెలిసిన మహిళలు సాధారణంగా పుట్టబోయే బిడ్డ గురించో లేదా తన ఆరోగ్య పరిస్థితి గురించో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ మహిళ మాత్రం అంబులెన్సులో బీఈడీ పరీక్షలు రాసి అనంతరం పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కొందరి ఆదర్శంగా మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగింది. పరీక్షలంటేనే లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు ఈ కాలం పిల్లలు.

రాజస్థాన్‌లోని ఝుంఝునూ జిల్లాలోని జిరి గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి, జేఎం బీఈడీ కాలేజీలో బీఈడీ చదువుతోంది. కాగా నిండు గర్భిణీ అయిన ఆమె మంగళవారం మధ్యాహ్నం సూరత్‌గఢ్‌ సీహెచ్‌సీలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే దీనికి ముందు మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆమె అంబులెన్స్‌లో తన బీఈడీ పరీక్ష రాసింది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా పురిటి నొప్పులను లక్ష్మీ లెక్కచేయకుండా, రాత్రి వేళలో ఆసుపత్రిలోనే మరునాడు ఎగ్జామ్ కు ప్రిపేర్‌ అయ్యి, బుధవారం కూడా అంబులెన్స్‌లో పడుకుని మరో పరీక్ష విజయవంతంగా రాసింది. లక్ష్మీ కుమారి భర్త శ్యామ్‌లాల్‌ మీనా దీని కోసం పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రవిశర్మతో మాట్లాడి అనుమతి తీసుకున్నారు.

కాగా, లక్ష్మీతోపాటు మరో ఇద్దరు కూడా ఇలానే పరీక్షలకు హాజరయ్యారు. సోను శర్మ, సరిత అనే ఇద్దరు మహిళలకు కూడా ఈ కేంద్రంలో పరీక్షలు రాశారు. నాలుగు రోజుల కిందట సోను ఒక శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం పరీక్ష రాసిన ఆమెకు పరీక్షాకేంద్రంలో ఒక బెడ్‌ ఏర్పాటు చేశారు పరీక్ష నిర్వాహకులు. మూడు రోజుల క్రితం సరిత కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె కూడా కారులో కూర్చొని పరీక్ష రాసింది. వీరికున్న పట్టుదలకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

Exit mobile version