Prime9

IAF Apache : యుద్ధ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. పఠాన్‌కోట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌

Pathankot : భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. పఠాన్‌కోట్‌ వైమానిక దళ స్టేషన్‌ నుంచి బయలు దేరిన నగంల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హాలెడ్‌ గ్రామం వద్దకు రాగానే అపాచి హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్‌ హెలికాప్టర్‌ను గ్రామంలోని ఓ బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా కిందకు దించారు.

 

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సాంకేతిక సమస్యలకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. వాయుసేన హెలికాప్టర్‌ గ్రామ సమీపంలో దిగడంతో ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడ గుమిగూడారు.

Exit mobile version
Skip to toolbar