Site icon Prime9

Maharashtra Heart Attack : వీడ్కోలు సమావేశం.. ప్రసంగిస్తుండగా గుండెపోటుతో విద్యార్థిని మృతి

Maharashtra Heart Attack

Maharashtra Heart Attack

Maharashtra Heart Attack : వయసుతో ఎలాంటి సంబంధం లేకుండానే గుండెపోటుతో పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల ప్రోగ్రామ్‌లో విద్యార్థిని మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

 

 

మహారాష్ట్రలోని ధారశివ్‌ జిల్లాలోని ఓ కళాశాల యాజమాన్యం ఇటీవల వీడ్కోలు పార్టీ నిర్వహించింది. వీడ్కోలు పార్టీలో పాల్గొన్న 20 ఏళ్ల విద్యార్థిని వేదికపై మాట్లాడుతోంది. కళాశాలలో తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. తన మాటలతో సరదాగా నవ్వించింది. మాట్లాడుతుండగా నేలపై ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడ ఉన్నవారు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

విద్యార్థిని గుండెపోటుతోనే మృతిచెందినట్లు తాజాగా డాక్టర్లు ధ్రువీకరించారు. 8 ఏళ్ల వయసులో ఆమెకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని, ఇన్నేళ్లపాటు ఆరోగ్యంగానే ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 12 ఏళ్ల తర్వాత గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చిన్న వయసులో ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా నేల కూలింది. గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు వెల్లడైంది. అంతకుముందు క్రికెట్‌ ఆడుతూ, నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ ఇలా అనేక మంది గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.

 

 

Exit mobile version
Skip to toolbar