Prime9

Bhopal : ఆటోపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు యాత్రికుల మృతి

Seven pilgrims dead : ఓ లారీ అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాస్తున్న ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘటన జరిగింది. ఎనిమిది మంది యాత్రికులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు. ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారు.

 

ఈ రోజు తెల్లవారుజామున జాతీయ రహదారి 30లోని సోహాగి లోయ వద్ద లారీ అదుపుతప్పింది. యాత్రికులు ప్రయాణించిన ఆటోపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణించిన 8 మంది యాత్రికుల్లో ఏడుగురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar