Site icon Prime9

Agricultural labourers: తగ్గిన సాగు విస్తీర్ణం ఉపాధికోల్పోయిన 80 లక్షల వ్యవసాయకూలీలు

New Delhi: దేశవ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు గత ఏడాదితో పోల్చితే జూలై 7 నాటికి 15 శాతం తగ్గింది. మొత్తంగా, రైతులు 6.3 మిలియన్ హెక్టార్ల (Ha) పొలాల్లో విత్తలేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ (CMIE) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ జూన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం వ్యవసాయరంగంలో ఉపాధిని దెబ్బతీసిందని చెప్నారు.“మొదటి పక్షం రోజులలో (జూన్) వర్షాలు సాధారణం కంటే 32 శాతం తక్కువగా నమోదయ్యాయి. దీనివల్ల పొలాలకు వెళ్లే కూలీల సంఖ్య తగ్గింది. వీరి సంఖ్య ఎనిమిది మిలియన్లదాకా వుండవచ్చు.

ఖరీఫ్ సీజన్‌లో ఈ దశలో ఎక్కువ ఉపాధి తోటల కూలీలకు లేదా నాట్లు వేయడానికి దొరుకుతుంది జూన్‌లో సాగు కేవలం నాలుగు మిలియన్ల మందికే ఉపాధిని అందించే అవకాశం వుందని CMIE తెలిపింది. 2021 మరియు 2020లో ఇదే నెలలో ఉన్న గణాంకాల కంటే ఇది తక్కువ. మొత్తంమీద, దేశంలో నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, CMIE అంచనా ప్రకారం ప్రజలు ఉద్యోగాల కోసం వెతకడం మానేశారని లేదా వారు లేబర్ మార్కెట్‌ను విడిచిపెట్టారని తేలింది.

Exit mobile version