Site icon Prime9

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో హృదయవిదారక ఘటన.. సోదరుడి మృతదేహంతో రోడ్డు పక్కనే కూర్చున్న పసివాడు

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన రెండేళ్ల సోదరుడి మృతదేహంతో రోడ్డు పక్కన దీనంగా కూర్చున్న ఓ బాలుడిని చూసి ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు . అంబాహ్ లోని బద్ ఫ్రా గ్రామానికి చెందిన పూజారాం అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అతనితో పాటు తన ఎనిమిదేళ్ల కుమారుడు గుల్షన్ ను కూడా తీసుకొచ్చాడు. అయితే పరిస్థితి విషమించడంతో రాజా ఆస్పత్రిలోనే మృతి చెందాడు.

పూజారాం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ 15వందల రూపాయలు ఆడిగాడు. దీంతో చేసేదేమీ లేక పూజారం సహాయం కోసం రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో తన చిన్నకుమారుడి మృతదేహాన్ని పెద్ద కుమారుడి చేతులో పెట్టి వెళ్లారు. ఓ తెల్లటి క్లాత్ లో తన సోదరుడి మృతదేహాన్ని పెట్టుకుని రోడ్డు పక్కనే కూర్చిండి పోయాడు గుల్షన్. ఎంత సేపటికి తండ్రి రాలేదు. అయితే అటుగా వెళ్లే పోలీసులు గుల్షన్ ను గమనించారు. అతడి చేతుల్లో ఉన్న తెల్ల క్లాత్ నుంచి చేయి బయటకు కన్పించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకున్నారు.

పోలీసులు అడిగిన ప్రశ్నలకు గుల్షన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన సోదరుడు మరణించాడని, ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇక్కడే కూర్చున్నట్లు తెలిపాడు. సహాయం కోసం తన తండ్రి రోడ్డుపైకి వెళ్లినట్లు అక్కడికి వచ్చిన పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ కు చెప్పాడు. వెంటనే యోగేంద్ర సింగ్ రాజా మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి గుల్షన్ ను తీసుకెళ్లాడు. అనంతరం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి రాజా మృతదేహాన్ని వారి స్వగృహానికి తరలించారు.

Exit mobile version