Site icon Prime9

Ex-Indian Navy personnel: 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్ లో మరణశిక్ష

INDIAN NAVY

INDIAN NAVY

Ex-Indian Navy personnel:ఇండియాకు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం మూతపడిన అల్‌ దహురా కంపెనీకి చెందిన ఈ ఉద్యోగులకు పాత్రకు సంబంధించి కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది. కాగా దోహా కోర్టు తీర్పుపై భారత విదేశాంగమంత్రిత్వశాఖ స్పందించింది. ఖతార్‌ అధికారుల నుంచి తీర్పు పాఠం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.

అవినీతి , గూఢచర్యం కేసు..(Ex-Indian Navy personnel)

. కాగా కోర్టు తీర్పు తమను షాక్‌ గురి చేసిందని, మాజీ నేవీ ఉద్యోగుల కుటుంబసభ్యులతో పాటు వారి లీగల్‌ టీంతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగమంత్రిత్వశాఖ (ఎంఈఏ) పేర్కొంది. చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను వినియోగించుకుంటామని ఎంఈఏ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోందని.. శిక్షపడిన మాజీ నేవీ అధికారులకు ఇండియా తరపున కావాల్సిన లీగల్‌ అసిస్టెన్స్‌ ఇస్తామని తెలిపింది. భారతీయు అధికారులు ఖతార్‌ ప్రభుత్వంతో మాట్లాడి పరిస్థితిని వారికి వివరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.ఇక ఈ కేసు విషయానికి వస్తే ఇండియాకు చెందిన నేవీ అధికారులు,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన కంపెనీలపై అవినీతి , గూఢచర్యం కేసు మోపబడింది. కాగా ఈ కేసు 2012లో వెలుగు చూసింది. ఇక కేసు పూర్వాపరాల విషయానికి వస్తే అల్‌ దహురా కంపెనీ ఎనిమిది మంది సీనియర్‌ నేవీ అధికారులు లంచం ఇచ్చి ఇండియన్‌ ఆర్మీకి సంబందించిన కీలక సమాచారం అందించాలని కోరిందనేది ప్రధాన ఆరోపణలు. కాగా ఈ ఎనిమిది మంది నెవీ అధికారులను గూఢచర్యం అవినీతి కేసుపై అరెస్టు చేశారు. 2016 నుంచి వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో బ్రిగేడియర్‌ కుల్వీందర్‌సింగ్‌కు పది సంవత్సరాల జైలు శిక్ష పడగా, మిగిలిన అధికారులకు 3-7 సంవత్సరాల శిక్ష విధించింది కోర్టు.

ప్రస్తుతం అల్‌ దహురా కేసుకు సంబంధించి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది అధికారులు పేర్లు ఇలా ఉన్నాయి. కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కెప్టెన్‌ సౌరబ్‌ వశిష్ట, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, కమాండర్‌ పుర్నేందు తివారి, కమాండర్‌ సుగుణాకర్‌ పాకాలా, కమాండ్‌ సంజీవ్‌ గుప్తా, సెయిలర్‌ రాగేష్‌లున్నారు.

 

Exit mobile version