Site icon Prime9

Kerala Auto Driver: ఆటో డ్రైవర్ కు లాటరీలో 25 కోట్లు

kerala-auto-driver

Kerala: వివరాల మేరకు, కేరళలోని తిరువనంతపురంలో అనూప్ అనే అతను ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుండి లాటరీ టిక్కెట్లు కొనే మోజు ఉన్న అనూప్ ఓనం పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన జాక్ పాట్ లాటరీ టిక్కెట్టును రూ. 500 వెచ్చించి కొనుగోలు చేసాడు.

అతను కొనుగోలు చేసిన నెంబరుకు లాటరీలో మొదటి బహుమతిగా 25కోట్లు వచ్చిన్నట్లు అతనికి సమాచారం అందింది. పన్నుల అనంతరం అతనికి లాటరీ నిర్వహక సంస్ధ నుండి రూ. 15.75 కోట్లు బ్యాంకుకు జమ చేస్తామని వారు తెలిపారు. గతంలో కేవలం చిన్న చిన్న మొత్తాలకు సంబంధించిన లాటరీ టిక్కెట్టు కొనే అనూప్ ఓనం పండుగ సందర్భంగా తన శక్తికి మించి మరీ లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేశాడు. అది కూడా కుమారుని కిడ్డీ బ్యాంకులో నగదుతో టిక్కెట్టు కొన్న నెంబరుకు లాటరీ తగలడంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. గతంలో అనూప్ కొనుగోలు చేసిన టిక్కెట్లలో రూ. రెండువేల దాక లాటరీలో ప్రైజ్ మనీ వచ్చిన్నట్లు తెలిపాడు.

ఇదంతా అదృష్టంగా భావిస్తున్న అనూప్ ఆటో రిక్షా నడిపేందుకు ముందుగా అతను వంటపని చేస్తుండేవాడు. త్వరలో అనూప్ మలేషియా దేశానికి వెళ్లేందుకు సిద్దమౌతున్న సమయంలో లాటరీ రూపంలో లక్ష్మీ కటాక్షం అతని ఇంటికి చేరింది. గత సంవత్సరం కూడా కొచ్చికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కు బంపర్ డ్రాలో ప్రధమ బహుమతిని పొందాడు.

Exit mobile version