2 Undertrials Escape: ఛత్తీస్‌గఢ్‌ జైలునుంచి 23 అడుగుల గోడదూకి పారిపోయిన ఖైదీలు

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా జైలు నుంచి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు 23 అడుగుల గోడను దూకి తప్పించుకున్నారని పోలీసులు మంగళవారం తెలిపారు.

  • Written By:
  • Publish Date - December 6, 2022 / 05:09 PM IST

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా జైలు నుంచి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు 23 అడుగుల గోడను దూకి తప్పించుకున్నారని పోలీసులు మంగళవారం తెలిపారు. వీరిలో ఒకరు హత్య, మరొకరు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ సోమవారం ఉదయం జైలు సరిహద్దు గోడ దూకి పారిపోయారు.

గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో జైలులో ఉన్న కపిల్ భగత్, హత్య నిందితుడు లలిత్ రామ్‌తో కలిసి తప్పించుకున్నాడని, వారిని కనిపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జాష్‌పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఉమేష్ కశ్యప్ తెలిపారు.సోమవారం ఉదయం జైలు ఖైదీలకు ఆహారం వండేందుకు సిద్ధమవుతున్న సమయంలో జైలు సరిహద్దు గోడ దూకి వీరిద్దరూ తప్పించుకున్నారని జష్‌పూర్ జైలు సూపరింటెండెంట్ మనీష్ సంభాకర్ తెలిపారు.

వారిపై జష్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, జైలు భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జష్‌పూర్‌లోని సోగ్డా గ్రామానికి చెందిన భగత్‌పై అత్యాచారం కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెండింగ్‌లో ఉందని కశ్యప్ తెలిపారు.తుమ్లా ప్రాంతానికి చెందిన రామ్‌పై కుంకూరి అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ జరుగుతోందన్నారు.