Brij Bhushan Saran Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ .. మహిళా రెజ్లర్లపై లైంగికవేధింపులు, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.
అతను ప్రస్తుతం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు గా ఉన్నాడు.
తనపై చేసిన చేసిన ఆరోపణలను అన్నింటినీ కుట్రగా పేర్కొన్న ఈ సింగ్ ఎవరు?
ఇదీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నేపధ్యం..
66 ఏళ్ల సింగ్ దాదాపు దశాబ్ద కాలంగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
2019లో మూడోసారి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.అతను 1980 లలో విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించాడు.
1988 లో బీజేపీలో చేరి రామ మందిరం ఉద్యమం సమయంలో ప్రచారంలోకి వచ్చాడు.
1991లో యూపీలోని గోండా నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యాడు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో పాటు సింగ్ పేరు కూడా ఉంది.
2008లో సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరాడు. 2009లో కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.
2014 లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు మళ్లీ బీజేపీలో చేరాడు.
myneta.info సైట్ ప్రకారం, అతను సుమారు 10 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నాడు.సింగ్ ఆరుసార్లు ఎంపీగా ఉన్నాడు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నుండి పార్లమెంటు సభ్యుడుగా ఉన్నాడు.
పలు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడుగా ఉన్నాడు.
2021లో అసెంబ్లీ ఎన్నికలకు గంటకు రూ.85,000 కోట్ల చొప్పున హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు.
అతను తరువాత హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ప్రైవేట్ హెలికాప్టర్‌ను కలిగి ఉన్న కొంతమంది నేతల్లో అతను ఒకడు.
2021లో,అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ మొదటి రౌండ్‌లో స్టేజ్‌పై రెజ్లర్‌ను చెంపదెబ్బ కొట్టాడు.
ఆరోపణలు నిజమని తేలితే ఆత్మహత్యచేసుకుంటాను..
ఫోగట్ తనపై చేసిన ఇటీవలి ఆరోపణలను సింగ్ కొట్టిపారేశాడు, “లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ అవాస్తవం.
అవి నిజమని తేలితే నేను ఆత్మహత్య చేసుకుంటాను.
నేను , బజరంగ్ పునియాతో సహా మల్లయోధులతో సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ అవలేదని తెలిపాడు.
సింగ్ ను పదవినుంచి తప్పించే వరకూ నిరసన కొనసాగుతుంది..
జాతీయ శిబిరంలో అధ్యక్షుడు మరియు కొంతమంది కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారని రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆరోపించారు.
నేను ఈ రోజు బహిరంగంగా చెప్పాను, రేపు నేను బతికే ఉంటానో లేదో నాకు తెలియదు.
లక్నో నుండి శిబిరాన్ని తరలించమని మేము చాలాసార్లు అభ్యర్థించాము.
డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక దోపిడీ గురించి నాకు చెప్పిన కనీసం 10-12 మంది మహిళా రెజ్లర్లు నాకు తెలుసు.
వారు తమ కథలను నాకు చెప్పారు. వారి పేర్లు ఇప్పుడు ఉన్నాయి. కానీ మేము దేశ ప్రధాని మరియు హోం మంత్రిని కలిసినట్లయితే నేను ఖచ్చితంగా పేర్లను వెల్లడిస్తాను.
ఈ కేసుపై కోర్టుల్లో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
హైకోర్టుకు సాక్ష్యాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, దీనిపై కోర్టులో పోరాడతామని చెప్పారు.
“మాకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. “రేపు మాకు ఏదైనా జరిగితే, దాని వెనుక బ్రిజ్ భూషణ్ సింగ్ ఉన్నారని అనుకోండి.
సింగ్‌ను అతని పదవి నుండి తొలగించే వరకు తమ నిరసన కొనసాగుతుందని వినేష్ చెప్పారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/