Site icon Prime9

Microsoft: మైక్రోసాఫ్ట్ పెద్ద మనసు.. దివ్యాంగులకు లక్ష ఉద్యోగాలు

Microsoft: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దివ్యాంగులకు లక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇందుకు ఎనేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. ఆర్థిక సేవలు, తయారీ, రిటైల్, టెక్ వంటి రంగాల్లోని 100 కంటే ఎక్కువ సంస్థలను ఒక చోట చేర్చడం కోసం ఇన్‌క్లూజన్ టు యాక్షన్ పేరుతో ఆపర్చునిటీ ప్లాట్‌ఫామ్‌ను ఐటీ దిగ్గజం ఏర్పాటు చేయనుంది. టెక్నికల్ స్కిల్స్, మానిటరీ‌షిప్, ఇంటర్న్‌షిప్, ఉపాధి అవకాశాల కల్పనపై ఎనేబుల్ ఇండియాతో కలిసి పని చేయనుంది. తద్వారా దివ్యాంగులకు ఆర్థిక సాధికారత చేకూర్చేందుకు తమవంతు తోడ్పాటు అందించడమే అంతిమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

ఇందు కోసం ఎనేబుల్ ఇండియా అండ్ మైక్రోసాఫ్ట్ మధ్య అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. టెక్ స్కిల్స్, మెంటర్ షిప్, ఇంటర్న్ షిప్ వంటి అవకాశాలను పొందడం కోసం ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పలు సంస్థలు హైబ్రిడ్ వర్క్ స్ట్రాటజీలను ఎక్కువగా అనురిస్తుండటంతో డిజిటల్ యాక్సెసిబిలిటీ పై అవగాహన పెంచుకోవడానికి టెక్నికల్ స్కిల్స్ ప్రోగ్రామ్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. మరోపక్క దివ్యాంగులకు ప్రాతినిధ్యం పెరుగుతోంది. అధిక ఉత్పాదకత, సమర్థవంతమైన సహకారం కోసం మోడరన్ వర్క్ ప్లేస్ అప్లికేషన్‌లపై ట్రైనింగ్ యాక్సెస్ పొందటానికి దివ్యాంగులకు అవకాశం ఏర్పడనుందని ఎనేబుల్ ఇండియా తెలిపింది.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శుభవార్త : Good News For Microsoft Employees | Prime9 News

మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు లోపాల కారణంగా వెనుకబడినవారికి మైక్రోసాఫ్ట్ సదుద్దేశంతో సువర్ణావకాశాన్ని కల్పించిందని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar