Site icon Prime9

Breast Cancer Treatment: ఒక్కరూపాయితో రొమ్ము క్యాన్సర్ చికిత్స.. ఎక్కడో తెలుసా..!

Breast Cancer

Breast Cancer

 Breast Cancer Treatment: మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే రొమ్ము క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. దీని కారణంగా చాలా మంది నిరుపేద ప్రజలు సరైన సంరక్షణ లేక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం లేకుండా పోతున్నారు. ఇప్పుడు, అందరికీ సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే లక్ష్యంతో, కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయడానికి చొరవ తీసుకుంది.

వైద్య కళాశాలకు చెందిన వైద్యులు ఆంకో-మమ్మోప్లాస్టీ టెక్నిక్‌తో బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నారు. దీనిపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కలా మాట్లాడుతూ, ఆంకో-మమ్మోప్లాస్టీ టెక్నిక్ ద్వారా, రోగి శరీరం నుండి రొమ్ములోని క్యాన్సర్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగిస్తారని చెప్పారు. “ఈ తీసివేయబడిన భాగం వాల్యూమ్ రీప్లేస్‌మెంట్ పద్ధతి ద్వారా పునర్నిర్మించబడుతుందని చెప్పారు. రొమ్ము తొలగింపు కారణంగా, మహిళలు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారని, అయితే కొత్త టెక్నాలజీతో దీనిని నివారించవచ్చని డాక్టర్ కాలా పేర్కొన్నారు. ఈ టెక్నిక్ ద్వారా 48 ఏళ్ల రోగికి శస్త్రచికిత్స నిర్వహించబడిందని ఇది విజయవంతమైందని ఆయన తెలిపారు.

వైద్య చికిత్స ఖర్చు గురించి డాక్టర్ కలా మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఈ మెడికల్ కాలేజీలో చికిత్స పొందడం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ మీరు రూ.1 ఫారమ్‌ను పూరించాలి. మిగిలిన చికిత్స అంతా ఆసుపత్రి చూసుకుంటుంది. దీనితో పాటు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా నేరుగా రోగులకే అందజేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version