Site icon Prime9

Doctors removed 187 coins from man’s stomach: వ్యక్తి కడుపు నుంచి 187 నాణేలను తొలగించిన వైద్యులు

coins

coins

Karnataka: కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఓ వ్యక్తి కడుపు నుంచి 187 నాణేలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి శనివారం కడుపులో అసౌకర్యం మరియు వాంతులతో బాధపడటంతో బంధువులు హానగల్ శ్రీ కుమారేశ్వర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అతనికి ఎక్స్-రే తీసారు.

ఈ సందర్బంగా అతని కడుపులో చాలా నాణేలు ఉన్నట్లు తెలిసింది. అతను గత 2-3 నెలలుగా నాణేలు మింగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అసాధారణ ప్రవర్తనకు మానసిక రుగ్మత కారణమని వైద్యులు తెలిపారు. అతనికి ఆపరేషన్ చేసి మొత్తం నాణేలను తొలగించారు.

Exit mobile version