Site icon Prime9

Citadel: 10 వేల ఉద్యోగుల కుటుంబాలకు డిస్నీల్యాండ్ ట్రిప్ ఏర్పాటు చేసిన సిటాడెల్ సీఈవో

Citadel

Citadel

Citadel: సిటాడెల్ సీఈవో మరియు వ్యవస్థాపకుడు కెన్ గ్రిఫిన్ తన కంపెనీలో 10,000 మంది సిబ్బంది కుటుంబాల కోసం డిస్నీల్యాండ్ ఫ్లోరిడాకు మూడు రోజుల విడిదికోసం పర్యటన ఏర్పాటు చేసాడు. దీనితో వీరందరూ తమ బాస్ ఎంతమంచి వాడో అని మురిసిపోతున్నారు.

గ్రిఫిన్ న్యూయార్క్, హ్యూస్టన్, పారిస్, జ్యూరిచ్ మరియు ఇతర నగరాల్లో ఉన్న ఉద్యోగులందరి విమాన టిక్కెట్లకు, వారి భోజనం మరియు ఇతర సౌకర్యాల కోసం అతనే చెల్లించాడు. డిస్నీల్యాండ్‌లోని సిబ్బంది కోసం కోల్డ్‌ప్లే మరియు కార్లీ రే జెప్‌సెన్ సంగీత కచేరీని ఏర్పాటు చేశాడు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, గ్రిఫిన్ తన సిబ్బందితో ఇలా అన్నాడు, మనం, ఆర్థిక చరిత్రలో అత్యంత అసాధారణమైన జట్టును నిర్మించాము. మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది – మరిన్ని కొత్త అధ్యాయలకోసం నేను ఎదురు చూస్తున్నాను.కెన్ గ్రిఫిన్ $31.7 బిలియన్లకు పైగా నికర విలువతో హెడ్జ్ ఫండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 40వ స్థానంలో నిలిచాడు.

Exit mobile version