Organ Donation: తాను చనిపోయి మరో ఇద్దరు చిన్నారులకు ఊపిరిపోసాడు..

బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన 16 నెలల బాలుడు తన అవయవాల ద్వారా మరోఇద్దరు చిన్నారుల ప్రాణాలకు ఊపిరిపోసాడు. తమ కళ్లఎదుటే తమ చిన్నారి చనిపోవడం తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు వైద్యుల సూచనమేరకు అవయవమార్పిడికి సహకరించడం గొప్ప విషయం. ఈ విధంగా వారు మరో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగారు.

  • Written By:
  • Publish Date - August 27, 2022 / 03:14 PM IST

Organ Donation: బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన 16 నెలల బాలుడు తన అవయవాల ద్వారా మరోఇద్దరు చిన్నారుల ప్రాణాలకు ఊపిరిపోసాడు. తమ కళ్లఎదుటే తమ చిన్నారి చనిపోవడం తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు వైద్యుల సూచనమేరకు అవయవమార్పిడికి సహకరించడం గొప్ప విషయం. ఈ విధంగా వారు మరో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగారు.

వృత్తిరీత్యా ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన ఉపేందర్ ఈ నెల 17న పనికి వెడుతుండగా అతని 16 నెలల కుమారుడు రిషాంత్ కు సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. దీనితో వెంటనే ఇంటికి వెళ్లి దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాడు. అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఎయిమ్స్ లోని జై ప్రకాష్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు, అక్కడ ఆగస్టు 24న బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. దీనితో కుటుంబసభ్యలు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ సందర్బంగా ఎయిమ్స్ వైద్యులు రిషాంత్ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయని తెలిపారు ఈ విషయమై వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనితో వారు అతని అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు.

అవయవాలు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) ద్వారా కేటాయించబడ్డాయి. రిషాంత్ రెండు కిడ్నీలు ఇప్పుడు ఎయిమ్స్ లో ఐదేళ్ల బాలుడికి మార్పిడి చేయగా, అతని కాలేయం మాక్స్ హాస్పిటల్‌లో ఆరు నెలల బాలికకు మార్పిడి చేయబడింది. అతని గుండె కవాటాలు మరియు కార్నియాలు ఎయిమ్స్ లో భద్రపరచబడ్డాయి. ఈ విధంగా ఆ బాలుడు తాను చనిపోయి కూడ మరో ఇద్దరి జీవితాలను నిలబెట్టాడు.