Two Historic Reservation Bills in Telangana Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలోకి నేడు రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ముందుకు రానుంది. ఈ రెండు బిల్లులపై సభలో రెండు రోజుల పాటు చర్చ జరగనుంది. అలాగే బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఇప్పటికే ఈ బిల్లులుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో శాసనసభ ఆమోదం తీసుకోనుంది. ఇందులో భాగంగానే నేడు, రేపు ఈ బిల్లులపై కీలక చర్చలు జరగనున్నాయి.
ఇక, బీసీ రిజర్వేషన్ల విషయానికొస్తే ప్రస్తుతం వీరికి 29 శాతం అమలవుతోంది. దీనికి 42 శాతానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణలో కూడా వర్గీకరణ చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను సర్కార్ నియమించింది. ఈ మేరకు నివేదికగా విడుదల చేసింది. ఇందులో ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా ర్గీకరణ చేయాలని పేర్కొంది.