Site icon Prime9

Kishan Reddy : తమిళనాడులో కుటుంబ, కుంభకోణం పాలన : కిషన్‌రెడ్డి  

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : ఇప్పటివరకు డీలిమిటేషన్‌పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

 

 

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చెన్నై జరిగిన సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం కోసం తహతహలాడుతోందని ధ్వజమెత్తారు. దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీ కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పాత బంధం మరోసారి బయటపడిందని ఆరోపించారు.

 

 

డీలిమిటేషన్‌ విధివిధానాలపై ఇప్పటివరకూ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. దక్షిణాది ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో కుటుంబ, కుంభకోణం పాలన జరుగుతోందని ఆరోపించారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి పనిచేస్తోందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీ మరింత బలపడుతోందన్నారు. కాంగ్రెస్‌ పాలిత మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కేంద్రం కోరుకుంటోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Exit mobile version
Skip to toolbar