Site icon Prime9

TS Inter Results: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల ఎప్పుడంటే..

TS Inter Results

TS Inter Results

TS Inter Results: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ పరీక్షఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్ ఫలితాలను మంగళవారం(మే 9 ) న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. స్పాట్ వాల్యూయేషన్ కూడా 20 రోజుల క్రితమే పూర్తి అయింది. ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు.

 

ఈ ఏడాది ఫలితాలు జాప్యం (TS Inter Results)

కాగా, ఈ ఏడాది ఇంటర్ పరీక్ష్లల ఫలితాలు విడుదలకు జాప్యం జరిగింది. సాధారణంగ పరీక్షలు జరిగిన నెల రోజుల్లోనే ఫలితాల ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆలస్యమైంది. అయితే ఆలస్యం అయ్యే కొద్ది దాని ప్రభావం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలపై పడుతుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్షలకు హాజరవుతారు. అందులో ఉత్తీర్ణులైతే విద్యా సంవత్సరం వృద్ధా కాకుండా ఉంటుంది. మరో వైపు ఈ నెలలోనే ఎంసెట్ తో పాటు వివిద ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. వెంటనే వాటి ఫలితాలు కూడా వెలువడతాయి. అయితే ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి.. వాటి రిజల్ట్ త్వరగా విడుదల చేస్తేనే విద్యార్థులు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఫలితాలు కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

 

పది ఫలితాలకు ఏర్పాట్లు

కాగా, పదో తరగతి ఫలితాలను ప్రకటించడానికి వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలు వెల్లడించిన రెండుమూడు రోజుల్లోనే టెన్త్ ఫలితాలు ప్రకటించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏప్రిల్ 3 నుంచి 11 వ తేదీ మధ్య పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది 6 పేపర్లు కావడంతో వాల్యుయేషన్ త్వరగా పూర్తి చేశారు.

 

Exit mobile version