Site icon Prime9

TANA : తానా సభలకు రండి.. సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

TANA

TANA

TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి 5వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తానా 24వ కాన్ఫరెన్స్‌కు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి, కాన్పరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి ఉన్నారు. కాగా, తానా అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థగా ఉంటూ తెలుగు సమాజానికి ఎనలేని సేవలందిస్తోంది. తానా 24వ కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కూడా ఆహ్వానపత్రికలు అందజేశారు.

Exit mobile version
Skip to toolbar