Site icon Prime9

Telangana Education Department : 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana Education Department

Telangana Education Department

Telangana Education Department : తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతుండగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానుండగా, తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ ఖరారు చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్కపూట బడులు కొనసాగుతున్నాయి. వేసవి సెలవుల్లో భాగంగా మొత్తం ఈ సారి 45 రోజులకు పైగా పాఠశాలలు మూత పడనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar