Nizamabad: నిజామాబాద్ ప్రధాన ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ రోగిని తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో.. నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారు.
https://twitter.com/SVishnuReddy/status/1647079552269815808?s=20
వీడియో వైరల్.. (Nizamabad)
నిజామాబాద్ ప్రధాన ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ రోగిని తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో.. నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారు.
గత నెల 31వ తేదీన ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆస్పత్రికి తల్లిదండ్రులతో వచ్చాడు. అత్యవసర విభాగం వైద్యులు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు.
మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉండటంతో.. ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఆ తర్వాతి ఉదయం.. వైద్య పరీక్షల నిమిత్తం రెండో అంతస్తుకు వెళ్లడానికి వీల్ చైర్ లేకపోవడంతో.. అతడిని నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్కసారిగా విమర్శలు రావడంతో.. దీనిపై చర్చ మెుదలైంది.
సిబ్బంది లేకపోవడం వల్ల ఇలా జరిగిందా.. లేక సిబ్బంది నిర్లక్ష్యమా అనేది విచారణలో తేలాల్సి ఉంది.
మరోవైపు దీనిపై ఆసుపత్రి సిబ్బంది స్పందించింది. చక్రాల కుర్చీని తీసుకొచ్చేలోపే.. లిఫ్ట్ రావడంతో వారి తల్లిదండ్రులు నేలపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారని చెప్పారు.
రెండో అంతస్తుకు వెళ్లాక అతడిని వీల్‌ఛైర్‌లోనే తీసుకెళ్లినట్లు తెలిపారు.
దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు..
ఈ ఘటనపై సూపరింటిండెంట్ స్పందించారు. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు.
పూర్తి సమాచారం తెలియకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా చేయడం బాధాకరం.
తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ ఆసుపత్రి ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది.
ఆస్పత్రిపై దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం అని సూపరింటెండెంట్ తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు.