Site icon Prime9

Hyderabad : జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్‌

Hyderabad

Hyderabad : సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్‌ అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి బెయిల్ లభించింది. రూ.25 వేల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

 

‘నిప్పు కోడి’ అనే ఎక్స్‌ హ్యాండిల్‌లో ముఖ్యమంత్రిని రేవంత్‌రెడ్డిని తిడుతున్న వీడియో వైరల్‌గా మారిందని కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పల్స్‌ టీవీకి చెందిన ఓ రిపోర్టర్‌ గుర్తుతెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్‌ టీవీ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయించిందని, పల్స్ టీవీలో వచ్చిన వీడియోను ‘నిప్పుకోడి’ అనే ఎక్స్‌ హ్యండిల్‌లో ట్రోల్ చేసినట్లు గతంలో పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు చేసి టీవీ ఛానల్ సీఈవో, జర్నలిస్టు రేవతితో పాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వీరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Exit mobile version
Skip to toolbar