Site icon Prime9

Jagga Reddy : వెండితెరపై జగ్గారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే ప్రకటన

Jagga Reddy

Jagga Reddy : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీలో చురుగ్గా ఉంటూనే నటనా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ‘జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమా నిర్మాణం కాబోతున్నది. ఆయన నిజజీవిత పాత్రనే సినిమాల్లో జగ్గారెడ్డి పోషించనున్నారు. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అనుమతితోనే సినిమాలో నటిస్తున్నానని, ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర, ముగింపు వరకు ఉంటుందని చెప్పారు. అయితే, మాజీ ఎమ్మెల్యే నిజజీవితం ఆధారంగా సినిమా వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాప్‌గా మారింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా రానుందని, తెలుగు, హిందీ భాషల్లో మూవీ చిత్రీకరణ జరుగుతుందని టాక్.

Exit mobile version
Skip to toolbar