JPS: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గడువును వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వారు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
గడువు పూర్తి..
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గడువును వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వారు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది.
స్పందించని ప్రభుత్వం..
విధించిన గడువులోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం సూచించింది. అయితే కార్యదర్శులు విధుల్లో చేరలేదు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేపీఎస్‌లు తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. గతంలో సమర్పించిన ఒప్పందాన్ని ఉల్లఘించవద్దని ఉద్యోగులకు చెప్పారు. ఇదిలా ఉండగా.. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. తమను రెగ్యులర్ చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. ఇక, రేపటి నుంచి కుటుంబ సభ్యులతో సమ్మెలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.