TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. వాటికి ఛార్జీలు తగ్గింపు

TGSRTC decreases ticket price on special buses: పెళ్లిళ్లు, టూర్ల ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.పెళ్లిళ్ల సీజన్‌లో శుభకార్యాలకు, హాలీ డేస్ టూర్ల కోసం వెళ్లాలనుకునే వారి కోసం అద్దెకు తీసుకునే బస్సులపై టీజీఎస్ఆర్టీసీ  ఛార్జీలను  తగ్గించింది. ఈ మేరకు అన్ని రకాల సర్వీస్‌లపై ఛార్జీలు తగ్గించినట్లు యాజమాన్యం ప్రకటించింది.

పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో ప్రజల నుంచి డిమాండ్‌ దృష్ట్యా ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. పల్లె వెలుగు బస్సు అద్దె గతంలో కిలోమీటర్‌కు రూ.68 ఉండగా.. ఈ ధరలను ప్రస్తుతం రూ.52కు తగ్గించింది. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.69 తీసుకోగా.. ఇప్పుడు రూ.62కు కుదించింది. ఇక, డీలక్స్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.65 నుంచి రూ.57కు తగ్గించింది. సూపర్ లగ్జరీ బస్సులకు రూ.65 నుంచి రూ.59కి తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.