Site icon Prime9

TGPSC: గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదల..8,084 మంది అభ్యర్థులతో జాబితా

TG Group 4 Final Results: తెలంగాణ గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో వివరాలు పొందుపర్చారు. https://www.tspsc.gov.in/వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం 8,084 మంది అభ్యర్థులతో జాబితాను అందుబాటులో ఉంచారు. గతేడాది జూలైలో గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడంతో గ్రూప్‌ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై టీఎస్ పీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. తుది ఎంపికకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. వెరిఫికేష‌న్ తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ దశలవారీగా ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో తాజాగా గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది.

Exit mobile version