Prime9

Tenth Results 2025: పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. నేడే రిజల్ట్స్

Telangana SSC Results Today: తెలంగాణ విద్యార్థులకు బిగ్ అప్డేట్. పదో తరగతి ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.15 నిమిషాలకు హైదరాబాద్‌లో ఉన్న రవీంద్రభారతిలో ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటివరకు పదో తరగతి మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి పలు మార్పులు చేశారు.

 

ఇందులో భాగంగానే, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పదో తరగతి మెమోలపై గ్రేడ్లకు బదులుగా సబ్జెక్టుల వారీగా మార్కులు ఇవ్వనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం పదో తరగతి పరీక్షకు 5,09,453 మంది విద్యార్థులు హాజరయ్యారు.

 

అలాగే, ఇందులో కనీస మార్కులు వస్తే ఉత్తీర్ణత అని, లేని యెడల ఫెయిల్ అని మార్కుల మెమోలపై నమోదు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితాల కోసం విద్యార్థులు bse.telangana.gov.in తోపాటు results.bse.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 

అంతకుముందు ఏప్రిల్ 4వ తేదీన పదో తరగతి పరీక్షలు పూర్తవగా.. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 19 శిబిరాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించారు. అయితే ఈ ఫలితాలను ఎలా విడుదల చేయాలనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఆలస్యం జరిగింది. సర్కార్ నుంచి స్పష్టత రావడంతో టెన్త్ బోర్డు అధికారులు ఇవాళ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధం చేశారు.

Exit mobile version
Skip to toolbar