Telangana High Court : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించిన ఓ పిటిషనర్‌కు రూ.కోటి ఫైన్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఓ కేసు హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా, విషయాన్ని దాచిన పిటిషనర్ మరో బెంచ్ వద్ద కొత్త పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకున్నాడు.
విషయం కోర్టు దృష్టికి రావడంతో జస్టిస్ నగేశ్ ఆగ్ర వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడంపై ఆయన మండిపడ్డారు. ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, మరో బెంచ్ వద్ద రిట్ పిటిషన్ ఎలా వేస్తారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా పిటిషనర్‌కు రూ.కోటి ఫైన్ విధించారు. కాగా, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు జస్టిస్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది.