Hyderabad: దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. అభివృద్దికి మూడు సూత్రాలు మూలమవుతాయిని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన అతి కొద్దికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. నాలెడ్జ్ సిటీలో డిప్లమాటిక్ ఔట్ రీచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన, తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావించారు.
15 వందలకుపైగా మల్టీనేషన్ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించాయని వెల్లడించారు. ప్రపంచంలో భారత్ నంబర్ వన్‌లో ఉండాలంటే ఇన్నేవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు.
తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతున్నదని కేటీఆర్ వివరించారు.