Site icon Prime9

Hyderabad: సిటీలో పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. భారీగా సీఐల బదిలీలు

police station

police station

Telangana: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునఃవ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత 35 క్రితం నాటి జీవోలను సర్కారు సవరించిందని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీని ప్రకారం అడిషనల్ గా రెండు లా అండ్ ఆర్డర్ జోన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్లు, అదనపు ట్రాఫిక్ జోన్, మరో 11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే నగరంలోని 7 జోన్లకు 7 మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు మహిళా భద్రతా విభాగం, స్పెషల్ సైబర్ క్రైమ్ యూనిట్, ఐటీ వింగ్, నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేశారు. అందుకుగాను 1200 సిబ్బందిని అదనంగా అవసరమవుతారని తెలిపారు.

 

అయితే కొంత కాలంగా పోలీస్ స్టేషన్ సరిహద్దులు, పోలీసు సేవలు పొందేందుకు కలుగుతున్న సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ప్రజలకే కాక.. పోలీసులకు కూడా వృత్తిపరంగా సమస్యలు తలెత్తడంతో గందరగోళం ఏర్పడింది.

 

నగర పరిధిలో 72వ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ను టోలిచౌకి పోలీస్ స్టేషన్ గా ఏర్పాటు చేశారు. అలాగే మూడు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లకు పేర్లు మార్పులు చేశారు. గోల్కొండ డివిజన్ ను టోలిచౌకి డివిజన్ గా, సెక్రటేరియట్ పీఎస్ ను లేక్ సెక్రటేరియట్ పీఎస్ గా, హుమాయున్ నగర్ పీఎస్ ను మెహదీపట్నం పీఎస్ గాను, షాహినాయత్ గంజ్ పీఎస్ ను గోషామహల్ పీఎస్ గా పేరు మార్చారు.

 

అలాగే ప్రస్తుతం ఉన్న మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తొలగించారు. అలాగే నాంపల్లి ట్రాఫిక్ పీఎస్, అంబర్ పేట్ ట్రాఫిక్ పీఎస్, లంగర్ హౌస్ ట్రాఫిక్ పీఎస్, బహదూర్ పుర ట్రాఫిక్ పీఎస్, నల్లకుంట ట్రాఫిక్ పీఎస్ పేర్లను గాంధీనగర్ ట్రాఫిక్ పీఎస్, ఉస్మానియా ట్రాఫిక్ పీఎస్, కుల్సుంపుర ట్రాఫిక్ పీఎస్, ఛత్రినాకా ట్రాఫిక్ పీఎస్, సైదాబాద్ ట్రాఫిక్ పీఎస్ గా పేర్లు మార్చారు.

 

ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. సుమారు 146 మందికి స్థానచలనం కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version
Skip to toolbar