7 New Navodaya Schools starts in Telangana: తెలంగాణలో మరికొన్ని జిల్లాల్లో నవోదయా పాఠశాలు ఏర్పాటు కానున్నాయి. కాగా ఈ విద్యాసంవత్సరం నుంచే ఆయా స్కూళ్లలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జూలై 14 నుంచి క్లాసులు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. కొత్తగా నవోదయా స్కూళ్లు మంజూరైన కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తరగతుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకం, విద్యా ప్రణాళిక, జిల్లా యంత్రాంగంతో సమన్వయం వంటి అంశాలను చర్చించారు. ఈ మేరకు సెక్రటేరియట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి నవోదయ విద్యాలయాల సమితి హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ టి. గోపాల్ కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ టి. సూర్య ప్రకాశ్, బి. చక్రపాణి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ హాజరయ్యారు. కాగా కొత్తగా ఏర్పాటైన నవోదయా స్కూళ్లతో గ్రామీణ ప్రాంతాల్లోని మెరిట్ స్టూడెంట్స్ కు మెరుగైన విద్య అందించే అవకాశం కలుగుతుంది.